మాజీ సీఎం కేసీఆర్ పై సైఫాబాద్ పీఎస్ లో ఫిర్యాదు

హైద‌ర‌బాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాల మాదిగ సంఘాల జేఏసీ చైర్మైన్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ మాదిగ దేవ‌ళ్ల‌. కేసీఆర్ పై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ తల్లిని దూషించినందుకు తాము నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద డప్పు చప్పుతో నిరసన తెలిపామని అన్నారు. దళితులమైన తాము ఫామ్ హౌస్ రోడ్లపై నడిచినందుకు కేసీఆర్ ఆ నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయించాడ‌ని , ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు స‌తీష్ మాదిగ దేవ‌ళ్ల‌.

దళితులంటే కేసీఆర్ కు చిన్నచూపు , ఆయన ప్రోద్భలంతోనే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై ఆ వ్యాఖ్యలు చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దళితులను ప‌నిగ‌ట్టుకుని అవమానించిన కేసీఆర్ పై ఎస్సి , ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ సంద‌ర్బంగా చెప్పారు సతీష్ మాదిగ. ఇదిలా ఉండ‌గా కేసీఆర్ చర్యలకు నిరసనగా ఆయన నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో శుద్ధి చేస్తాం అని ప్ర‌క‌టించారు. ఇంకోసారి బీఆర్ఎస్ కు చెందిన నేత‌లు ఎవ‌రైనా త‌మ జాతికి చెందిన వారిని అవ‌మానిస్తే తాట తీస్తామ‌న్నారు.

  • Related Posts

    సీఎం విజ‌య్ కు ఎంకే స్టాలిన్ స్ట్రాంగ్ కౌంట‌ర్

    చెన్నై : డీఎంకే పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను ఏకి పారేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా త‌న గురించి బాడీ షేమింగ్…

    ఈగోలు ప‌క్క‌న పెట్టండి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించండి

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం రాష్ట్ర స‌చివాల‌యంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జ‌రిగింది. ఈ స‌ద‌స్సులో ఆయా జిల్లాల నుంచి వ‌చ్చిన క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌సంగం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *