సీఎం చంద్ర‌బాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ( టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌తో పాటు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ బోర్డు స‌భ్యులు , ఆల‌య అర్చ‌కులు శ‌నివారం అమ‌రావ‌తి నివాసంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల‌లో జ‌రిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకిదేవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్, ఈవోలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

    కేర‌ళ : కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ‌నివారం దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు. ముందురోజు…

    ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

    తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించను్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *