భారీ వ‌ర్షాలతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి : అనిత

అమరావతి : ఏపీ రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా నిర్వహించారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అల్పపీడన తీవ్రత, వర్షాల పరిస్థితులపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారాన్ని అందించాలని మంత్రి సూచించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు మొబైల్ హెచ్చరిక సందేశాలను నిరంతరం పంపించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. మరోవైపు వినాయక చవితి వేడుకల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు వర్షాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణం విషయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • Related Posts

    తెలంగాణ అంతటా కృత్రిమ పనీర్‌పై నిషేధం

    హైద‌రాబాద్ : ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ , నాన్-డైరీ (పాలేతర) పనీర్ తయారీ , అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధించింది. మార్కెట్లో కృత్రిమ, నాన్-డైరీ పనీర్ విక్రయాలు వెలుగులోకి…

    బ్రిక్స్ దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాలు అవ‌స‌రం

    న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే బ్రిక్స్ ఆర్థిక శక్తి దాదాపు రెట్టింపు వేగంతో విస్తరిస్తోందని పేర్కొన్నారు. బ్రిక్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *