డబ్బులున్న వాళ్లకే సీట్లు ఇస్తున్న చంద్రబాబు
అమరావతి : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏకంగా పార్టీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం కలకలం రేపింది. డబ్బులు ఉన్న వాళ్లకే ఎమ్మెల్యే, ఎంఎల్సీ పదవులు ఇస్తున్నాడని మండిపడ్డారు. ముస్లింలకు చిన్నచిన్న నామినేటెడ్ పోస్టులతో సరి పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. 2019లో నా కుమార్తె ఓటమికి కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. TDPలో యాక్షన్ ఉండదు.. రియాక్షన్ అంతకంటే ఉండదంటూ బాంబు పేల్చారు జలీల్ ఖాన్.
అందుకే ఓటమికి కారకులైన వారి పేర్లు బయట పెట్టలేదన్నారు. ఈసారి మేయర్ గా నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పట్టంచు కోవడం లేదంటూ భగ్గుమన్నారు జలీల్ ఖాన్. ఎన్నికల సమయంలో ముస్లింలు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. ముస్లింల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జలీల్ ఖాన్. ఈ నిర్లక్ష్యానికి ఫలితం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై తప్పకుండా పడుతుందన్నారు.