కొడాలి నాని సమక్షంలో వైసీపీలో భారీగా చేరికలు

విజ‌య‌వాడ : మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో శ‌నివారం ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు గుడ్లవల్లేరు మండలం పెంజంద్ర గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో యువత కూడా పార్టీలో చేరారు. తన పుట్టిన రోజున పార్టీలో చేరిన బొప్పన రామచంద్రరావు కి మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, సమాజంలోని వివిధ వర్గాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలా కాకుండా, కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి, భయభ్రాంతులకు గురిచేసే విధానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

పార్టీలో చురుకుగా పాల్గొనే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారని విమర్శించారు కొడాలి నాని. పోలీసు యంత్రాంగం, అధికార బలంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం బీజేపీ ఆశీస్సులతోనే తిరిగి అధికారంలోకి రావాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని నిప్పులు చెరిగారు. అనంతరం బొప్పన రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆ పార్టీ చేసిన మోసాలు, అరాచకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే తాను వైసీపీ చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి, అర్హులైన ప్రతి వ్యక్తికి ‘నవరత్నాలు’ వంటి సంక్షేమ పథకాలు నేరుగా అందాయని ఆయన గుర్తు చేశారు.

నేడు అధికారంలో ఉన్న ‘వెన్నుపోటు’ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం పని చేయడానికి బదులుగా, కేవలం తమ సొంత నాయకుల ప్రయోజనాల కోసమే పథకాలను మారుస్తూ, రాష్ట్ర ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని , ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు.

  • Related Posts

    జీహెచ్ఎంసీ కార్మికులకు అండగా ఉంటా : తీన్మార్ మల్లన్న

    హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ)లో ప‌ని చేస్తున్న కార్మికుల‌కు భ‌రోసా ఇచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. ఆయ‌న తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికార యాత్రను చేప‌ట్టారు. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను…

    డ‌బ్బులున్న వాళ్ల‌కే సీట్లు ఇస్తున్న‌ చంద్ర‌బాబు

    అమ‌రావ‌తి : టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ఏకంగా పార్టీ చీఫ్‌, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. డ‌బ్బులు ఉన్న వాళ్ల‌కే ఎమ్మెల్యే, ఎంఎల్సీ ప‌ద‌వులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *