ప్రతిభ కనబర్చిన సాయి కుమార్ కు కంగ్రాట్స్
తాడేపల్లి గూడెం : ఈ నెల 9-13 తేదీల్లో మర్కాపురంలో జరిగిన 11వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించడమే కాకుండా ఏపీ నుంచి జాతీయ పోటీలకు ఎంపికైన వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయికుమార్ ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖా మంత్రి ఎస్.సవిత అభినందించారు. బాల్ బ్యాడ్మింటన్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని ఆకాంక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వినుకొండ ఎంజేపీ బీసీ గురుకుల విద్యార్థి, బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు సాయికుమార్, కోచ్ జూనా నాయక్, ప్రిన్సిపాల్ వై.రమేశ్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ నెల 9-13 తేదీల్లో మార్కాపురంలో జరిగిన 11వ ఏపీ స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు థర్డ్ ప్లేస్ సాధించి… జాతీయ పోటీలకు ఎంపికైనట్లు మంత్రి సవితకు సాయికుమార్ తెలిపాడు. వచ్చే నెల మూడో తేదీ నుంచి చత్తీస్ ఘడ్ లో జరిగే జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొన బోతున్నట్లు వెల్లడించాడు. బాల్ బ్యాడ్మింటన్ లో రాణిస్తున్న బీసీ విద్యార్థి సాయికుమార్ ను మంత్రి సవిత కొత్త దుస్తులు అందజేసి, అభినందించి సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించింది… రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతలు తీసుకు రావాలని కోరారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో సాయికుమార్ కు మెళకువులు నేర్పిన కోచ్ జూనా నాయక్ ను, ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.రమేశ్ ను కూడా మంత్రి సవిత అభినందించారు.