newsseals.com

వరద నియంత్రణ చర్యలు చేపట్టాలి : రామానాయుడు

September 24, 2026 · VijayaBhaskar

అమరావతి : రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం తాజా ప‌రిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపధ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.హాజరైన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కడా కమీషనర్ ప్రశాంతి, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, సిఈలు, ఎస్ఈలు , ఇతర ఉన్నతాధికారులు. వాతావరణ శాఖ ముందస్తు సమాచారం తీసుకుంటూ, వరద నియంత్రణ చర్యలు చేపట్టాల‌ని ఆదేశించారు.

రిజర్వాయర్లు, నదులుర వాగుల్లోకి వచ్చే నీటి పై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అన్నారు నిమ్మ‌ల రామానాయుడు. మున్నేరు కు వచ్చే ఇన్ ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులు పని చేయించాలని అన్నారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ వర్షానికి అనుగుణంగ పురుషోత్తమపట్నం పంపులు ఆపరేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు ప్రవాహల పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు నిరంతరం వార్ రూంలో పర్యవేక్షిస్తూ, క్షేత్ర స్దాయిలో ఉండాల‌ని పేర్కొన్నారు.

Related News