వరద నియంత్రణ చర్యలు చేపట్టాలి : రామానాయుడు

అమరావతి : రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం తాజా ప‌రిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపధ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.హాజరైన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కడా కమీషనర్ ప్రశాంతి, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, సిఈలు, ఎస్ఈలు , ఇతర ఉన్నతాధికారులు. వాతావరణ శాఖ ముందస్తు సమాచారం తీసుకుంటూ, వరద నియంత్రణ చర్యలు చేపట్టాల‌ని ఆదేశించారు.

రిజర్వాయర్లు, నదులుర వాగుల్లోకి వచ్చే నీటి పై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అన్నారు నిమ్మ‌ల రామానాయుడు. మున్నేరు కు వచ్చే ఇన్ ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులు పని చేయించాలని అన్నారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ వర్షానికి అనుగుణంగ పురుషోత్తమపట్నం పంపులు ఆపరేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులు ప్రవాహల పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు నిరంతరం వార్ రూంలో పర్యవేక్షిస్తూ, క్షేత్ర స్దాయిలో ఉండాల‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి

    అమ‌రావ‌తి : తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కాకినాడ జిల్లావ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో యంత్రాంగం మరో రెండు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వర్షాలు పూర్తిగా…

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టాలి : జ‌గ‌న్

    తాడేప‌ల్లి గూడెం : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గురువారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో స‌మావేశం జ‌ర‌గింది. స్థానిక సంస్థల ఎనికల్లో పార్టీ తరఫున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *