newsseals.com

శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ప్రారంభం

September 24, 2026 · VijayaBhaskar

తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, మృత్సం గ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, ప‌విత్ర అధివశం నిర్వ‌హించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా 24న గురువారం తేదీన పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 25న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 26న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌. భ‌క్తులు ఒక్కొక్క‌రు రూ.750/- చెల్లించి ఒక‌రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని తెలిపారు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు ఈవో.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో డా ఎ శరత్, ఆల‌య డెప్యూటీ ఈవో హరింద్ర నాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ లు రమేష్, చెంగల్రాయులు, ఆలయ ఇన్స్పెక్టర్ లు చలపతి, లక్ష్మీకాంతం, ఆలయ అర్చ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related News