newsseals.com

రిజర్వాయర్ల మెయింటెన్స్ పనులకు రూ. 160 కోట్లు

September 28, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని కాలువలు ,డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెన్స్ పనులకు సంబందించి 160 కోట్ల బిల్లులు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌న్నారు. తక్ష‌ణ‌మే నిధుల విడుద‌ల‌కు ఆదేశించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు మంత్రి ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. గత 5ఏళ్ళ గొడ్డలి పార్టీ పాలనలో నిర్లక్ష్యానికి గురై, విధ్వంశమైన నీటిపారదుల వ్యవస్ధను నేడు చంద్రబాబు గాడిలో పెట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సాగునీటి సంఘాల వ్యవస్దను పునరుద్ధరించి, రైతులకు చంద్రబాబు కొండంత భరోసా ఇచ్చార‌ని పేర్కొన్నారు.

ఎల్ నినో వంటి క్లిష్ట సమయంలో కూడా ఉన్న కొద్ది పాటి జలవనరులను సమర్దవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు నిమ్మ‌ల రామానాయుడు. రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణ విజయవంతం అవుతుంద‌ని ప‌దే ప‌దే చంద్ర‌బాబు న‌మ్ముతూ వ‌చ్చార‌న్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఓఅండ్ఎం పనులకు కేవలం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించి, ఇరిగేషన్ ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ రెండేళ్ళలోనే కూటమి ప్రభుత్వం ఓఅండ్ఎం పనుల కోసం 1320 కోట్లు మంజూరు చేశాం అన్నారు.

Related News