‘ఆదర్శ కుటుంబం’ నారాయణమ్మ పాట అదుర్స్
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు విక్టరీ వెంకటేశ్. ఇక మాటల మాంత్రికుడిగా, దిగ్గజ దర్శకుడిగా టాప్ లో కొనసాగుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం – ఏకే 47 . మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన త్రివిక్రమ్ ఇప్పుడు మరో హిట్ ను కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఆయన మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు మరింత పెంచేలా చేశాయి. తాజాగా ‘ఆదర్శ కుటుంబం – AK47’ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ విడుదలైంది. పాట విడుదల సందర్భంగా వేదికపై వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, డింపుల్ హయాతి, నివేదా పేతురాజ్ చేసిన డ్యాన్స్ అభిమానులలో మరింత జోష్ నింపేలా చేసింది.
ఈ సందర్బంగా ఆదర్శ కుటుంబంలో ముఖ్య పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ఆదర్శ కుటుంబం మామూలు కుటుంబం కాదు.. వేరే లెవెల్‌లో ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు ఉంటాయని అంటూ సినిమాపై మరించ అంచనాలు పెంచేలా చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే నెల అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. దీంతో వెంకీ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.