newsseals.com

స్విట్జర్లాండ్ తెలంగాణ మ‌ధ్య బంధం బ‌లోపేతం

October 9, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల రాష్ట్ర కార్యదర్శి (State Secretary for Economic Affairs) హెలీన్ బడ్లిగర్ ఆర్టిడా హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారిని కలుసుకున్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. సాంకేతికత, ఆవిష్కరణలు, లైఫ్ సైన్సెస్, అధునాతన తయారీ రంగాలు, కొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తూ స్విట్జర్లాండ్ , తెలంగాణ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఈ ఇద్ద‌రూ విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపాయి. పెట్టుబడులు, ఉపాధి, విజ్ఞాన మార్పిడికి మరిన్ని అవకాశాలను కల్పించే దిశగా స్విట్జర్లాండ్‌తో కలిసి పని చేయడానికి మా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ప్ర‌క‌టించారు ఈ సంద‌ర్భంగా.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు మాట్లాడారు. ఈ భాగస్వామ్యం సహకారానికి కొత్త మార్గాలను సుగమం చేస్తుందని చెప్పారు. స్విట్జర్లాండ్, తెలంగాణ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే దేశంలోనే పెట్టుబడుల‌కు, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, స్టార్ట‌ప్ ల‌కు , ఔత్సాహికుల‌కు స్వ‌ర్గధామంగా హైద‌రాబాద్ న‌గరం వినుతి కెక్కింద‌ని చెప్పారు దుద్దిళ్ల శ్రీ‌ద‌ర్ బాబు. త‌మ ప్ర‌భుత్వం కొలువు తీరాక ఐటీ, పారిశ్రామిక‌, లాజిస్టిక్ రంగాల బ‌లోపేతంపై దృష్టి సారించింద‌న్నారు. ఈ బంధం మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

Related News