newsseals.com

అడవి తల్లి బాట 2.0 కార్యక్రమానికి శ్రీకారం

October 11, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని డోలీ రహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా అడవి తల్లి బాట 1.0 విజయం ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కొణిద‌ల‌ ‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం రంప చోడవరం మండల పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న 3.4 కిలోమీటర్ల బీటీ రహదారికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు డిప్యూటీ సీఎం. నాలుగు గిరిజన ఆవాసాలను అనుసంధానించనున్న ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సుమారు 1,400 మందికి మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది.

రూ. 2.29 కోట్ల అంచనా వ్యయంతో ఈ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించనున్నారు. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసన సభ్యులు శిరీష, పంతం నానాజీ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కొత్తమాసు దినేష్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఇ. ఎన్. సి. శ్రీ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగించారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో గ్రామాల అభివృద్దిపై ఎక్కువ‌గా దృష్టి సారించామ‌న్నారు. ఈసారి బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా బ‌డ్జెట్ కేటాయించిన‌ట్లు తెలిపారు.

Related News