newsseals.com

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు దిశానిర్దేశం

October 11, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీలో స్థానిక సంస్థ‌ల ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వ‌హించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైసీపీ చేసిన అన్యాయాన్ని వివరించారు.

జయహో బీసీ అనే నినాదంతో ముందుకు వెళ్లాల‌ని దిశా నిర్దేశం చేశారు. జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణుల‌ను ఆదేశించారు సీఎం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని కలిసి ప్రచారం చేయాలంటూ ఆదేశించారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోందనే విషయాన్ని గమనించాలన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Related News