newsseals.com

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు స‌ర్కార్ పెద్ద‌పీట : పొన్నం ప్ర‌భాక‌ర్

October 11, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా షి పౌవ‌ర్ ఫౌండేష‌ణ్ ( SHE POWER Foundation ) ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన మహిళా భద్రత బైక్ ర్యాలీలో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మహిళల భద్రత, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు మంత్రి పొన్నం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ, వారి స్వేచ్ఛాయుత ప్రయాణానికి తోడ్పడుతున్నాం అన్నారు.

మహిళలు భయం లేకుండా, ఆత్మ విశ్వాసంతో ప్రయాణించే సురక్షిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని స్ప‌ష్టం చేశారు పొన్నం ప్ర‌భాక‌ర్. మహిళా భద్రత, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న SHE POWER Foundation నిర్వాహకులను అభినందిస్తున్నానని తెలిపారు. దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్రంలో లేని విధంగా తాము మ‌హిళ‌ల అభివృద్ది కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తి మ‌హిళ‌ను కోటీశ్వ‌రురాలిగా మార్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించామ‌న్నారు.

Related News