newsseals.com

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

October 11, 2026 · VijayaBhaskar

పోల‌వ‌రం జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం లో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా కాకవాడ బహిరంగ సభ నుంచి స్థానిక ఎన్నికల శంఖారావం పూరించారు పవన్ కళ్యాణ్ . స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్య‌ర్థులు స‌త్తా చూపించాల‌ని, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో జ‌న‌సైనికులు త‌మ శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడార‌ని, అదే స్పూర్తిని ఇప్పుడు స్థానిక సంస్థ‌ల్లోనూ చాటాల‌ని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

మూడు పార్టీలు బాగుండాల‌ని అన్నారు. 2024 ఎన్నికల్లో జనసైనికులు త్యాగం చేశార‌ని కొనియాడారు . స్థానికంగా కూటమి బలపడితే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి అని అన్నారు. రాష్ట్రానికి డబ్బులు ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్ధవంతంగా ప్రభుత్వం నడుపుతున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు. జన సైనికులు ఇప్పటి వరకూ ఒక్క పదవి ఆశించకుండా కూటమి కోసం పనిచేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. 2019-24 వరకూ వైసీపీ శిలాఫలకాలు, రంగులు మాత్రమే వేసిందని ఆరోపించారు. పల్లెల అభివృద్ది కోసం ఏ ఒక్క ప‌ని చేప‌ట్ట లేద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్ర అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా పని చేస్తున్నామని చెప్పారు.

Related News