మెట్రో, బస్సు, రైల్వే సర్వీసులు పునరుద్దరించండి
న్యూఢిల్లీ : భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ కూటమి సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. ఈగలను చంపేందుకు బలమైన ఆయుధాలు వాడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. ఇది సర్కార్ కు మంచిది కాదని హితవు పలికింది. రోజూ వారీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. దేశ రాజధానిలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం, నిత్యావసర రవాణా సేవలు సాధారణంగా పనిచేసేలా చూడటం ఆవశ్యకతను నొక్కి చెప్పింది.
ప్రజల భద్రతను కాపాడటానికి, అంతరాయాలను తగ్గించడానికి మెట్రో, రైల్వే, బస్సు సేవలను పూర్తిగా నిలిపి వేయకూడదని ఆదేశించింది. తగిన నియంత్రణలతో నడపాలని కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్ సదుపాయం, ప్రజల స్వేచ్ఛా రాకపోకలపై ఆంక్షలను కూడా ఇది ప్రస్తావించింది. ఢిల్లీలో నిరసనల సందర్భంగా మెట్రో స్టేషన్ల మూసివేత, రవాణా అంతరాయాలు, ఇంటర్నెట్ ఆంక్షలతో సహా విధించిన పరిమితులపై ఆందోళనల మధ్య ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంబంధిత పక్షాలు లేవనెత్తిన సమస్యలను కోర్టు పరిశీలిస్తోంది. ఆందోళనకారులను తొక్కి పెట్టేందుకు 3 వేల మందికి పైగా పోలీసులను మోహరించింది సర్కార్. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టు.