విజయవాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ PAC సభ్యులకు జిల్లాల వారీగా కీలక బాధ్యతలు అప్పగించారు పీసీసీ అధ్యక్షురాలు. సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డికి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు అప్పగించారు. మాజీ కేంద్రమంత్రి పల్లం రాజుకు అనకాపల్లి, విశాఖ జిల్లాలు, CWC సభ్యుడు గిడుగు రుద్రరాజుకి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, మాజీ కేంద్రమంత్రి, Apcc వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం కి అన్నమయ్య, కర్నూలు జిల్లాలు అప్పగించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇక వీరితో పాటు ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కి తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలు కేటాయించారు.
మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ కి మన్యం, అల్లూరి జిల్లాలు, మాజీ ఎంపీ హర్షకుమార్ కి కాకినాడ జిల్లా
మాజీ ఎంపీ, ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డికి అనంతపురం, సత్యసాయి జిల్లాలు అప్పగించారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ కు ప్రకాశం, గుంటూరు జిల్లాలు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కి పల్నాడు జిల్లా, మాజీ ఎమ్మెల్యే ఎలిజాకు నంద్యాల, తిరుపతి జిల్లాలు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి NTR జిల్లా , కృష్ణా జిల్లాలు, ఉపాధ్యక్షులు సూర్యనాయక్ కి కడప, బాపట్ల జిల్లాలు బాధ్యతలు అప్పగించారు షర్మిలా రెడ్డి. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం, పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, చేరికల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని పీఏసీ సభ్యులను ఆదేశించారు పీసీసీ చీఫ్.




