Wednesday, 14 October 2026

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల : సీఈఓ

newsseals-AnilChandraPunetha

విజ‌య‌వాడ : రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించి షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎన్నిక‌ల సంఘం ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (సీఈఓ) అనిల్ చంద్ర పునేఠా. బుధ‌వారం ఆయ‌న విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలు లోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు. అక్టోబ‌ర్ 28న ఎన్నికలు జ‌రుగుతాయ‌ని, 30న ఫలితాలు వెల్లడిస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఈఓ. ఈ నెల 18న నామినేషన్లు స్వీక‌రిస్తామ‌ని , 19న‌ నామినేషన్లు ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు. 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వ‌హిస్తామ‌న్నారు.

నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్ల‌డిస్తామ‌న్నారు సీఈఓ అనిల్ చంద్ర పునేఠా.
3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు చేప‌డ‌తామ‌న్నారు. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జ‌రుగుతాయ‌ని తెలిపారు. 26న తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయ‌న్నారు. 29న 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జ‌రుగుతాయ‌ని సీఈఓ వెల్ల‌డించారు. డిసెంబర్ 2న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఈఓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *