newsseals.com

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన ఏఈవో

October 16, 2026 · VijayaBhaskar

తిరుమల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. ప్ర‌స్తుతం శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవను పురస్కరించుకుని, గ్యాలరీల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉదయం, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మధ్యాహ్నం వేర్వేరుగా పరిశీలించారు. ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనం, వాహనసేవ వీక్షణం సౌకర్యవంతంగా ఉండేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఈవో, అదనపు ఈవో తెలిపారు. భక్తులకు ప్రణాళికా బద్ధంగా అన్న ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందించడంతో పాటు పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకోగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదనపు ఈవో వాహన మండపం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, పలువురు టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని వేంక‌టాద్రి యాప్ ను ప్రారంభించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇది శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఎంతో మేలు చేకూర్చేలా చేస్తోంది.

Related News