హైదరాబాద్ : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని , కయాదు లోహర్ కీ రోల్ పోషించిన ది ప్యారడైజ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మూవీని దక్కించుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. వాటిలో అమెజాన్ ప్రైమ్, జీ 5తో పాటు నెట్ ఫ్లిక్స్ కూడా ఉంది. అయితే చివరకు భారీ ధరకు ది ప్యారడైజ్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ స్వంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం ధ్రువీకరించింది కూడా. సోమవారం కీలక ప్రకటన చేసింది ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళం ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపైకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా, అక్టోబర్ 22న సినిమా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రంలో వర్దమాన నటుడు , డైలాగ్ కింగ్ గా పేరు పొందిన మంచు మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటించారు. సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తమ పాత్రలకు జీవం పోశారు. ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంపూర్ణేష్ బాబు కూడా ఒక పాత్రలో నటించారు. ప్రియదర్శి పోషించిన పాత్ర, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పోలి ఉండేలా ఉంటుంది. తనకు మంచి అప్లాజ్ వచ్చింది. ది ప్యారడైజ్ సక్సెస్ కావడంలో మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ప్రత్యేకించి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం పీక్ కు తీసుకు వెళ్లింది. ఇక ఆ కాసర్ల శ్యాం రాసిన పాటలు హైలెట్ గా నిలిచాయి.




