newsseals.com

రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డికి జైలు శిక్ష‌

November 10, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైకోర్టు ఆదేశాల‌ను ధిక్కరించినందుకు గాను రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది కోర్టు. ఈ మేర‌కు త‌మ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మ‌ధ్య ఉన్న‌తాధికారుల‌కు త‌మ ఆదేశాలు అంటే లెక్క‌లేకుండా పోయింద‌ని మండిప‌డింది. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన వాళ్లు ఇలా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నించింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. ఇంకోసారి త‌మ ఆదేశాలు ధిక్క‌రిస్తే శాశ్వ‌తంగా జైలులోనే ఉండాల్సి ఉంటుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్ర‌స్తుతానికి క‌లెక్ట‌ర్ నారాయ‌ణ రెడ్డికు ఆరు నెల‌ల జైలు శిక్ష విధిస్తున్న‌ట్లు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

ఇదిలా ఉండ‌గా తమ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుత 2025 ఆగస్టులో పలువురు బాధితులైన భూ యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విష‌యంపై ప‌లుమార్లు విచారణ చేప‌ట్టింది కోర్టు. ఇదే క్ర‌మంలో 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకు ఆదేశాలను పాటించక పోవ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది హైకోర్టు ధ‌ర్మాస‌నం. కోర్టు ధిక్కరణ కింద న్యాయమూర్తి ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 2,000 జరిమానా విధించారు . అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను నాలుగు వారాల పాటు నిలిపి వేస్తున్నట్లు జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.

Related News