Tuesday, 24 November 2026

లేడీ కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే అసభ్య మెసేజ్‌లు

newsseals-CollectorFiles

చెన్నై : త‌మిళ‌నాడు అధికార టీవీకే పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది తాజాగా ఎమ్మెల్యే వ్య‌వ‌హారం. త‌ను మ‌హిళా జిల్లా క‌లెక్ట‌ర్ కు అస‌భ్య మెస్సేజ్ లు పంపించాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై కేసు న‌మోదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. కలెక్టర్ ఫిర్యాదుతో ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరెస్ట్‌కు పోలీసులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తక్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని ఆదేశించింది. ఇదే క్ర‌మంలో కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ… ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించింది. లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే దీనిపై స్పందించారు మంత్రి. కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపారన్న ఆరోపణలను ఖండించారు. వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు పంపారని డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన ఆరోపణలు అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారం లేదని సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. టీవీకేకు చెందిన కళ్లకురిచ్చి ఎమ్మెల్యే సి. అరుల్ విగ్నేష్ ఒక మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన వాట్సాప్‌ సందేశాలు పంపారన్న ఆరోపణలు అబ‌ద్ద‌మ‌న్నారు. ఇవి అవాస్తవమని, నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. ఎటువంటి ధృవీకరణ లేకుండానే సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తినందుకు డీఎంకే ఎంపీ కనిమొళిని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *