newsseals.com

డీలిమిటేష‌న్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

November 28, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర బీజేపీ స‌ర్కార్ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్తుతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టాల‌ని యోచిస్తోంది. ఈ సంద‌ర్బంగా దేశంలోని వివిధ రాజ‌కీయ పార్టీలు త‌మ వైఖ‌రిని స్ప‌ష్టం చేశాయి. ఈ సంద‌ర్బంగా శ‌నివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ వైఖ‌రిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా ఉందన్నారు. దక్షిణ భారతదేశ పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో ఎలాంటి కోత ఉండకూడదని పేర్కొన్నారు. తెలంగాణకు జరిగే ఏ అన్యాయాన్ని తాము స‌హించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు కేటీఆర్.

గ‌త కొంత కాలంగా పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాల ప్రస్తుత 24 శాతం వాటాను కాపాడాలని తాము నిరంతరం డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.2051 వరకు అంతర్రాష్ట్ర ప్రాతినిధ్య నిష్పత్తిని కాపాడుతూ, సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే ప్రతిపాదనతో ముందుకు తెచ్చింది కేంద్రం. ఇదిలా ఉండ‌గా ఈ బిల్లు గ‌నుక ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయి. తెలంగాణ ప్రయోజనాలే మా ప్రథమ ప్రాధాన్యత కావడంతో, మా ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేస్తార‌ని వెల్ల‌డించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక తాము మహిళా రిజర్వేషన్లకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తున్నామని, వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని స్ప‌ష్టం చేశారు.

Related News