మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం
అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేంద్రం ప్రవేశ పెట్టే మహిళా బిల్లు గురించి శనివారం స్పందించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే అత్యంత కీలకం అని పేర్కొన్నారు. మహిళా సాధికారత కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయా ల్లోనూ మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సాధికారత ఏర్పడుతుందన్నారు. లేక పోతే ప్రమాదం నెలకొందన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ సర్కార్ దేనని పేర్కొన్నారు వంగలపూడి అనిత.
మహిళా నాయకత్వానికి రాష్ట్రంలో బాటలు వేశారన్నారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు రాష్ట్ర హొం శాఖ మమంత్రి. మహిళా రిజర్వేషన్ల దిశగా కేంద్రం మరో అడుగు వేయడంపై హర్షం వ్యక్తం చేశారు వంగలపూడి అనిత మహిళా రిజర్వేషన్ల ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా నిర్ణయాధికారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళలు మార్పులో భాగం కావాలని పిలుపునిచ్చారు.