కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

నిప్పులు చెరిగిన గుండ్ల‌క‌ట్ల జ‌గ‌దీశ్ రెడ్డి

హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను నిలువునా మోసం చేశార‌న్నారు. మెట్రో రైలు నుంచి కావాల‌ని ఎల్ అండ్ టి కంపెనీని త‌ప్పించార‌ని ఆరోపించారు. దీని వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఏకంగా రూ. 1500 కోట్ల‌కు పైగా భారం ప‌డుతుంద‌న్నారు. హైదరాబాద్ ప్రజలకు ఆ మాత్రం మెట్రో రైల్ కూడా లేకుండా చేస్తారని ఆవేదన వ్య‌క్తం చేశారు. అప్పుడు కూడా సీఎంకు మరో వెయ్యి కోట్లు వస్తాయన్నారు. ఉద్యోగాల జీతాలకు డబ్బులు లేవు.. కోసుకుతింటారా అన్న సీఎం రూ. 15 వేల కోట్ల భారం ఎందుకు నెత్తికి ఎత్తుకున్నారో చెప్పాల‌ని జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రజలపై రేవంత్ రెడ్డి ఈ భారం ఎందుకు వేశారో అందరూ ఆలోచించాలని అన్నారు. ఎల్ అండ్ టీ నడిపేలా ఒప్పందం ఉన్నప్పటికీ ఎందుకు పంపాల్సి వచ్చిందని నిల‌దీశారు జ‌గ‌దీశ్ రెడ్డి. కేవలం ఎల్ అండ్ టీకి లాభం చేసేందుకే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎల్ అండ్ టీకి చెందిన రూ. 35 వేల కోట్ల విలువైన భూములను తనకు ఇష్టమైన కంపెనీలకు అప్పగించేందుకు లోపాయికారిగా ఒప్పందం కుదిరింద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ దందాలా నడుస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో ఎవరైనా రోడ్లు వేస్తారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొదటి రోజు నుంచే తన రియల్ ఎస్టేట్ దందా పెందుకునేందుకు ప్లాన్ వేశాడ‌ని మండిప‌డ్డారు. లేని ఫ్యూచర్ సిటీకి, కట్టని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్ అట అంటూ ఎద్దేవా చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *