తాడేపల్లి గూడెం : శ్రీ సిటీ బాయిలర్ పేలుడు ఘటన సంభవించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు : వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ తో పాటు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని కోరారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన, గాయపడిన వారికి తక్షణమే నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.
సహాయక చర్యలను వేగవంతం చేయాలని ,బాధితుల కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని, కర్మాగార భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని డాక్టర్ గురుమూర్తి డిమాండ్ చేశారు. పరిశ్రమలలో కార్మికుల భద్రతా నిబంధనలను ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా అమలు చేయాలని అన్నారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారికి ఉత్తమ వైద్య చికిత్స అందాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చిన ఆయన, ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు పూర్తి అండగా నిలవాలని అన్నారు.





