|22-ఎ సమస్యల పరిష్కారానికి కీల‌క నిర్ణ‌యం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు తీపి కబురు చెప్పారు. నాలా రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేశామ‌న్నారు. ఈ మేర‌కు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన‌ట్లు తెలిపారు. మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశించామ‌న్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

22-ఎ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో వేగం కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ఐదు ఉత్త‌ర్వులు జారీ చేశామ‌న్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, GO 118, GO 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు, GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు ఉన్న 22ఎ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చామ‌న్నారు. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సి దరఖాస్తుల పరిష్కారానికి ఉత్తర్వులు జారీ చేసిన‌ట్లు తెలిపారు. తాజాగా నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంద‌న్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం అధికారుల కనీస బాధ్యత అని పేర్కొన్నారు.

  • Related Posts

    శ్రీ సిటీ బాయిలర్ పేలుడు ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి

    తాడేప‌ల్లి గూడెం : శ్రీ సిటీ బాయిలర్ పేలుడు ఘ‌ట‌న సంభవించ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు : వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ తో పాటు తిరుప‌తి ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన…

    సీఈఓల‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ వైర‌ల్

    వాషింగ్ట‌న్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు అమెరికా దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్నాల‌జీ ప‌రంగా ఆయా టాప్ కంపెనీల‌కు చెందిన చైర్మన్లు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *