రాజకీయాల్లో రాజీనామాలు సహజం : సీఎం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొత్త కేబినెట్ కూర్పుపై కొంద‌రు ఆశావాహులు త‌మ‌కు చోటు ద‌క్క‌క పోవ‌డం ప‌ట్ల బహిరంగంగానే విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ట్ల స్పందించారు తీవ్రంగా సీఎం. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కొంద‌రు త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల రాజీనామాల వార్తల‌న్నీ స‌హ‌జ‌మే కావ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా రాజకీయాల్లో రాజీనామాలు సహజం అని పేర్కొన్నారు. రాజీనామా చేయాలనుకునే వారిని ఎవరూ ఆపలేరని స్ప‌ష్టం చేశారు. పార్టీ , రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే వారు పార్టీలోనే కొనసాగాలే త‌ప్పా ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతే ఏ ఒక్క‌రు మిగ‌ల‌ర‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మిగిలినవన్నీ సాధ్యమవుతాయ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సీఎం డీకే శివ‌కుమార్. ధరం సింగ్ , సిద్ధరామయ్య హయాంలో నాకు మంత్రి పదవి దక్కనప్పుడు నేను కూడా రాజీనామా చేసి ఉండవచ్చు కదా? కానీ నేను, జి. పరమేశ్వర సంయమనం పాటించాం కదా? అని గుర్తు చేశారు . అలాగే, మంత్రులందరూ వెంటనే తమ నియోజకవర్గాలకు వెళ్లి కరువు సహాయక చర్యల పరిస్థితిని సమీక్షించాలని తాను ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇక నుంచి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *