శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వ‌ సేవకులకు వస్త్ర బహుమానం

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తి శ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు, వాహన బేరర్లు, మేళం సిబ్బంది, ఇతర ఆలయ సిబ్బందికి సోమవారం వస్త్ర బహుమానం అందించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ దంపతులు స్వచ్ఛందంగా ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో చౌద‌రి మాట్లాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అహర్నిశలు సేవలందిస్తున్న ఆలయ సిబ్బంది సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ దంపతులు వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమని ప్ర‌శంస‌లు కురిపించారు.స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని గౌరవించడం ద్వారా వారి సేవా స్ఫూర్తిని మరింత పెంపొందించినట్లు అవుతుంద‌ని చెప్పారు. రాబోయే రోజుల‌లో దాత‌లు, సంస్థ‌లు ముందుకు వ‌స్తే మ‌రింత మేలు చేసిన వార‌వుతార‌ని పేర్కొన్నారు వెంక‌య్య చౌద‌రి.

ఈ కార్యక్రమంలో సీవీఎస్వో కే వి మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక శోభ

    తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమలలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఎస్వీ సంగీత నృత్య…

    బ్రహ్మోత్సవాల్లో అలరించిన సీతాకల్యాణం నృత్య రూపకం

    తిరుమ‌ల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఆరవ రోజు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన “సీతాకల్యాణం” నృత్యరూపకం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకురాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *