హైదరాబాద్‌లో భారీ వర్షాల సూచన

హైద‌రాబాద్ : వాతావ‌ర‌ణ శాఖ కీల‌క సూచ‌న‌లు చేసింది. హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు తుండటంతో, వాటి ప్రభావం వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మంగళవారం నాడు హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున IMD ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. తెలంగాణ అంతటా ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.

క్యుములోనింబస్ (cumulonimbus) మేఘాల ప్రభావంతో నిన్న హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డిలో అత్యధికంగా 18.2 సెం.మీ వర్షపాతం నమోదైందని, వికారాబాద్ , సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా న‌గ‌ర వాసులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ పేర్కొన్నారు. జాబ్స్ ప‌ని చేసే చోట పూర్త‌యిన వెంట‌నే న‌గ‌రంలో త‌మ త‌మ ఇళ్ల‌ల్లోకి త్వ‌ర‌గా వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు వీసీ.

  • Related Posts

    ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులు : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రైవేట్ రంగంలో రూ.23 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని తెలిపారు. ఇప్పటికే రూ.రూ.11.37 లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమైన‌ట్లు పేర్కొన్నారు. పీపీపీ…

    తెలుగుజాతి గర్వించేలా అమరావతి : సవిత

    అమరావతి : తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *