కేంద్ర నిధులూ దారి మళ్లించారు : సీఎం

అమ‌రావ‌తి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన పథకాల నిధులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించిందని సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర నిధుల వినియోగంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగా కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులను నిర్దేశిత ప్రయోజనాలకే వినియోగించేలా వ్యవస్థను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాటి ప్రభుత్వం చివరకు మద్యం ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టి రూ.25 వేలకోట్లు అప్పులు తెచ్చిందని చంద్రబాబు విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీకి పూర్తి భిన్నంగా మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు ఉపయోగించారని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో కీలకంగా మారిందని సీఎం తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుందని వ్యాఖ్యానించారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పారు. కేంద్రం సాయం అందిస్తే దాన్ని అందిపుచ్చుకుని అభివృద్ధిగా మలచుకునేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే ఇదంతా చేయగలుగుతున్నామని చంద్రబాబు అన్నారు.

  • Related Posts

    బడుగులు, మహిళల సంక్షేమానికి పెద్ద పీట

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. SC సంక్షేమానికి రూ.19,100 కోట్లతో 43 లక్షల మంది లబ్దిదారులకు మేలు జ‌రిగింద‌న్నాడు. ST సంక్షేమానికి రూ.5,730 కోట్లతో 9 లక్షల మంది లబ్దిదారులు , BC సంక్షేమానికి రూ.32,534…

    రాబోయే రోజుల్లో ఏపీలో వైఎస్సార్సీపీదే అధికారం

    తాడేప‌ల్లి గూడెం : ఏపీలో రాబోయే కాలంలో మ‌నమే అధికారంలోకి వ‌స్తామ‌ని జోష్యం చెప్పారు మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ బాస్ జ‌గ‌న్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్‌సీపీలో చేరార‌రు. ఈయ‌న ఎవ‌రో కాదు ప్ర‌స్తుతం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *