ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాలి

ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, దిండి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన అనుకూల తీర్పు నేపథ్యంలో, ఈ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.

పాలమూరు ప్రాజెక్టుపై రూ. 36,437 కోట్లు, దిండి ఎత్తిపోతల పథకంపై రూ. 3,187 కోట్లు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టుపై రూ. 1,835 కోట్లు , గౌరవెల్లి ప్రాజెక్టుపై రూ. 1,350 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం వల్ల పనులు నిలిచి పోయాయని, తద్వారా ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా, ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి, రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, డాక్టర్ కడియం కావ్య, ఏపీ జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

    హైద‌రాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేద‌న్నారు. త‌నపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…

    నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తాం

    హైద‌రాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం గ‌త కొంత కాలం నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *