నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేస్తాం

హైద‌రాబాద్ : టీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం గ‌త కొంత కాలం నుంచి పార్టీ కోసం నిస్వార్థంగా, నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసిన పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వుల‌లో ప్ర‌యారిటీ ఇస్తామ‌న్నారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఇదే సంద‌ర్బంగా ఆయ‌న మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో 80 శాతం సీట్లు గెలుస్తాం అని ధీమా వ్య‌క్తం చేశారు. పట్టణ ప్రజలకు ఆషాడమాస బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయ‌ని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల నేతృత్వంలో అభివృద్ధి పరంగా దూసుకెళ్తోందని చెప్పారు మ‌హేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతంద‌ని పేర్కొన్నారు. ఇక్క‌డికి ఇంజనీరింగ్ వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం అన్నారు. క్లాసులు ప్రారంభమయ్యాయ‌ని తెలిపారు. లింబాద్రిగుట్ట పనులు ప్రారంభమవుతాయ‌ని వెల్ల‌డించారు టీపీసీసీ చీఫ్‌. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. ధాన్యం సేకరణ విషయములో కఠినంగా వెళ్లడానికి ప్రభుత్వానికి సూచనలు చేయాల‌ని కోరారు.

ఇంటిగ్రేటెడ్ కళాశాలలు 80 శాతం మంజూరు అయ్యాయని చెప్పారు. పామాయిల్ ఇండస్ట్రీ తో మంచి దిగుబడి వ‌స్తుంద‌న్నారు. జిల్లాకు చెందిన‌ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామ‌న్నారు. వర్షాభావం వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తామ‌న్నారు .హరీష్ రావుకి ఉలికిపాటు ఎందుకు అని ప్ర‌శ్నించారు. తమిళనాడు పర్యటన పై హరీష్ రావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు

    హైద‌రాబాద్ : తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేద‌న్నారు. త‌నపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…

    గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలి

    హైద‌రాబాద్ : డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్–2026 గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల‌న్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించే వేదికగా ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *