ప్రభుత్వ బ‌డుల్లో పెరిగిన ప్ర‌వేశాలు : నారా లోకేష్

అమరావతి: ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప‌లు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయలేదన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 2022-23 ఏడాదిలో 7.6 శాతం తగ్గాయ‌ని చెప్పారు. 2023-24 ఏడాదిలో 3.03శాతం తగ్గాయి. 2024-25లో 3.24 శాతం తగ్గిన‌ట్లు, దీనికి కార‌ణం తాము తీసుకు వ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితమేన‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫేక్ వివ‌రాలతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నారా లోకేష్‌. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలను నివారించడం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. నకిలీ డేటాను తొలగించాం. దీంతో 2025-26లో 1.69 శాతం ప్రవేశాలు తగ్గాయన్నారు మంత్రి. 2026-27 ఏడాదికి వచ్చేసరికి 0.94శాతం ప్రవేశాలు పెరిగాయని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    మత్స్యకారుల గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా

    అమరావ‌తి : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల క్షేమంపై…

    తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ

    హైద‌రాబాద్ : వరద రహిత నగరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, పూడిక పేరుకుపోయిన చెరువులను పునరుద్ధరించేందుకు గాను హైడ్రాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నిపుణులు తమ మద్దతును ప్రకటించారు. హైడ్రా కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, అలాగే చెరువులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *