NEWSTELANGANA

జ‌న‌సంధ్రం గులాబీమ‌యం

Share it with your family & friends

రేవంత్ ..మోదీపై కేసీఆర్ ఫైర్

పాల‌మూరు జిల్లా – మ‌రోసారి పాల‌మూరు జిల్లా ప్ర‌జ‌లు త‌మ‌కు కేసీఆర్ ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను చాటుకున్నారు. ఊహించ‌ని రీతిలో స్పందించారు. ప‌ట్ట‌ణ‌మంతా గులాబీమ‌యంగా మారింది. మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున జ‌నం పోగ‌య్యారు. క్లాక్ ట‌వ‌ర్ వేదిక‌గా జ‌రిగిన రోడ్ షో విస్తు పోయేలా చేసింది. వేలాది మంది కేసీఆర్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. జేజేలు ప‌లికారు.

అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి కేసీఆర్ త‌న‌దైన శైలిలో ప్ర‌సంగించారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో వున్నాయ‌ని, వీటిలో ఎవ‌రికి ఓటు వేస్తే మేలు జ‌రుగుతుందో ఆలోచించాల‌న్నారు. గ‌త 10 ఏళ్ల నుండి కేంద్రంలో ఉన్న బీజేపీ స‌ర్కార్ ఏనాడైనా సాయం చేసిందా అని ప్ర‌శ్నించారు కేసీఆర్.

100 నినాదాలు చేసిన ప్ర‌ధాని మోడీ ఒక్క‌ట‌న్న అమ‌లు చేశాడా అని నిప్పులు చెరిగారు. సబ్కా వికాస్ అన్నడు కానీ సత్యనాశ్ చేసిండని మండిప‌డ్డారు. అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా అని నిల‌దీశారు బీఆర్ఎస్ బాస్.

రూ. 15 ల‌క్ష‌లు ఖాతాల్లో జ‌మ చేస్తాన‌ని చెప్పాడ‌ని చేసిండా అని ఫైర్ అయ్యారు. ఏమీ చేయ‌ని న‌రేంద్ర మోడీ విశ్వ గురువు ఎలా అయ్యోడో బీజేపీ నేత‌లు చెప్పాల‌న్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేసీఆర్.