ఏపీలో విద్యా సంక్షోభం..డీఎస్సీ స్కాం : నేహా బోరా

విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు నేహా బోరా. డీఎస్సీ స్కాం, ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం, కోచింగ్ మాఫియా కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ పాలనలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఆర‌పించారు. విజయవాడలో జరిగిన ‘Gen-Z Rising’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా విద్యార్థులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు నేహా బోరా స‌మాధానం ఇచ్చారు. విద్య ద్వారానే మ‌నం మ‌రింత ప్ర‌శ్నించ‌డం నేర్చుకుంటామ‌ని అన్నారు. చ‌దువుకోక పోతే ఇబ్బందులు ప‌డ‌తామ‌న్నారు.

ప్ర‌తి ఒక్క‌రు భార‌త రాజ్యాంగాన్ని చ‌ద‌వాల‌ని కోరారు నేహా బోరా. మ‌న హ‌క్కులతో పాటు బాధ్య‌త‌ల‌ను కూడా గుర్తించాల‌న్నారు. ఈ దేశంలో ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు దూరంగా పాల‌న సాగుతోంద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి కేవ‌లం కులం, మ‌తం ప్రాతిప‌దికతో ముందుకు వెళుతున్నారంటూ మండిప‌డ్డారు. కానీ ఈ త‌రం ఎవ‌రినీ ఉపేక్షించ బోదంటూ పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని లేకుండా చేయాల‌ని, వారి స్వంత హిందూత్వ ఎజెండాను అమ‌లు చేయాల‌ని కుట్ర‌ల‌కు తెర లేపారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

  • Related Posts

    బండి సంజయ్ పై భ‌గ్గుమ‌న్న ఆకునూరి మురళి

    హైద‌రాబాద్ : మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పై.మాకు మీ రక్తం వద్దు. మీ దేశ భక్తి మాటలు వద్దు. మాకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, యువత కు గౌరవ…

    గొప్ప యోధుడు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న

    హైద‌రాబాద్ : సామాన్యుడు కూడా త‌లుచుకుంటే ఏదైనా సాధించ గ‌ల‌డ‌ని నిరూపించారు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ అని ప్ర‌శంసించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *