
తరం మారింది. అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తనలు , అభిరుచులు మారుతున్నాయి. ప్రతిదీ వ్యాపారం కావడంతో బూతు శ్రుతి మించుతోంది. ఇప్పటికే సెక్స్ , భక్తి రెండూ సమాన స్థాయిలో పోటీ పడుతున్నాయి. మూఢత్వం మనుషుల్ని కాకుండా చేస్తుంటే సెక్స్ మాత్రం టోటల్ గా డామినేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోతున్న రంగం ఏదైనా ఉందంటే అది శృంగారమే. టాప్ 5 వెబ్ సైట్స్ లలో వరల్డ్ వైడ్ గా చూస్తే సెక్స్ , పోర్న్ కు సంబంధించినవే ఉన్నాయి. ముఖ్యంగా భారత దేశంలో సెన్సార్ అనేది ఒకటంటూ ఉంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడల్లా సభ్యులు మారి పోతుంటారు. దీని కథ పక్కన పెడితే..ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చాక సెక్స్ అన్నది విశ్వ వ్యాప్తంగా మారి పోయింది. గదిలో ఉండాల్సిన సీన్లు ఇప్పుడు బహిరంగంగానే ప్రసారం అవుతున్నాయి. కేవలం పెద్దలకు మాత్రమే అని సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్లు. కొందరు పనిగట్టుకుని ఏముంది అందులో అంటూ ఉత్సుకత ప్రదర్శించడం జరిగేది. కానీ రాను రాను సినిమా రంగంలో ఇప్పుడు బూతు మాటలు, ముద్దులు, కౌగిలింతలు, బికినీలు, కిందా మీదా పడి పోవడాలు మామూలై పోయాయి.
ఇది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఓటీటీ ఆదిపథ్యం చెలాయిస్తోంది. చిన్నపాటి యాప్ ఉంటే చాలు..ఏదైనా చూసేయొచ్చు. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం యువతే కాదు అన్ని వర్గాల వాళ్లు వెబ్ సీరీస్ క్లిక్ చేస్తున్నారు. కావాల్సిందంతా చూసేస్తున్నారు. వీటికి రేటింగ్స్ కూడా ఉంటున్నాయి. అన్నీ ఇక్కడి నుంచి అనుకుంటే పొరపాటు పడినట్టే. ఇతర దేశాల నుంచి వీటిని స్ట్రీమింగ్ చేస్తున్నారు. కేవలం నెట్ కనెక్టివిటీ ఉంటే చాలు, కాస్తంత బేర్ (ధర) చెల్లించగలిగితే కావాల్సినంత , ఓపిక ఉన్నంత సేపు చూసేయొచ్చు. దీనిని అడ్డం పెట్టుకుని చిన్నా చితక కంపెనీలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలోకి వచ్చాయి. షార్ట్ ఫిలింస్ , ఫిలింస్ , సీరియల్స్ తో పాటు ఇప్పుడు వెబ్ సీరీస్ పై ఫోకస్ పెట్టాయి. బడా నిర్మాణ సంస్థలన్నీ కాసులు పెట్టుబడిగా పెడుతూ కోట్లు వెనకేసుకుంటున్నాయి.
వెబ్ సీరీస్ లలో అత్యధిక శాతం క్రైమ్, మసాలా, మాస్ , పొలిటికల్ , మర్డర్ , హవాలా, సైన్స్ , రొమాన్స్ పేరుతో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆయా వెబ్ సీరీస్ లలోకి పేరు పొందిన అందాల ముద్దుగుమ్మలు ఎంటర్ అవుతున్నారు. సినిమాలలో చేయాలంటే ఎంతో మందిని సంతృప్తి పర్చాలి. వాళ్లు చెప్పినట్లు చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. కొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది. సక్సెస్ టాక్ వస్తే వెబ్ సీరీస్ పార్ట్ 2, 3, 4, 5, 6 ఇలా తీసుకుంటూ పోతారు. సినిమాకు కావాల్సినంత టెక్నీషియన్స్ , లొకేషన్స్ అక్కర్లేదు. కేవలం కొద్ది మంది నైపుణ్యం కలిగిన వాళ్లుంటే చాలు. వెబ్ సీరీస్ క్లిక్కవుతాయి. లక్షల నుంచి కోటికి పైగా ఈ వెబ్ సీరీస్ లకే వ్యూయర్స్ షిప్ లు వస్తున్నాయి. వాటిని కాదనలేం. ఎందుకంటే వాళ్లు చూస్తున్నారు..మేం తీస్తున్నామంటూ సమాధానం చెబుతున్నారు మూవీ మేకర్స్, నిర్మాతలు.
ఇందులో సమాజానికి హితమైనవి కూడా లేక పోలేదు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. కానీ ఎక్కువ భాగం సెక్స్, పోర్న్ (బూతు) వాటికే ప్రయారిటీ ఇస్తుండడం ఒకింత ఆందోళన కలిగించే అంశం. తాజాగా ప్రముఖ నటీమణులుగా చెలామణి అవుతున్న ఇద్దరు హాట్ టాపిక్ గా మారారు. ఒకరు తమన్నా భాటియా కాగా మరొకరు కాజోల్. తాను ఎలాంటి ముద్దు సీన్లకు ఓకే చెప్పనంటూ ప్రకటించిన కాజోల్ ఉన్నట్టుండి లేటు వయసులో ట్రయల్ వెబ్ సీరీస్ లో రెచ్చి పోయి నటించింది. ముఖ్యంగా ముద్దు సీన్లలో. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఆమె ముద్దు సీన్లు. ఏ సినిమా అయినా లేదా ఏ వెబ్ సీరీస్ అయినా ఎంతగా వివాదాస్పదం అవుతే అంతగా రేటింగ్ వస్తుంది..వ్యూయర్ షిప్ దక్కుతుంది. పదుల సంఖ్యలో ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు ఉన్నా వాటిని కంట్రోల్ చేసే యంత్రాంగం ఈ దేశంలో లేదు. తాజాగా కేంద్ర సర్కార్ అంతా అయి పోయాక, డౌన్లోడ్ చేసుకున్నాక, వాటిని అంతా చూసేశాక 25 ప్రముఖ సెక్స్, సెమీ సెక్స్ , పోర్న్ ను బహిరంగంగానే స్ట్రీమింగ్ చేస్తున్న 25 ఓటీటీలను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా టెక్నాలజీ మారడంతో అవి మరో రూపంలో సెక్స్, పోర్న్ లవర్స్ కు అందుబాటులోకి వస్తాయి. కాకపోతే కాస్తా ఆలస్యం అంతే. ఇకనైనా వీటిని కూడా నియంత్రించే టెక్నాలజీ , సెన్సార్ షిప్ ఉంటే బావుంటుంది. లేక పోతే బూతు మరింత సర్వ వ్యాప్తం అవుతుందని తెలుసుకోవాలి. ఏది ఏమైనా హద్దుల్లో ఉంటేనే మంచిది. లేక పోతే వెగటు కలుగుతుంది. బాధ్యత కలిగిన ప్రింట్, డిజిటల్, మీడియాలతో పాటు ఓటీటీ సంస్థలు కొంత సంయమనం పాటిస్తే కొంతలో కొంత సమాజానికి మేలు చేసిన వారవుతారు. లేకపోతే నేరం చేసిన వాళ్లవుతారు.