మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో వేగంగా గుర్తింపు పొందుతున్న ఢిల్లీకి చెందిన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. ఆమె చేసిన ప్రత్యేకమైన “6-7” వికెట్ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆగస్టు 20న Central Delhi Queens vs South Delhi Superstarz మ్యాచ్‌లో South Delhi Superstarz బ్యాటర్ నిషికా సింగ్ వికెట్ తీసిన తర్వాత మేధావి బిధూరి “6-7” స్టైల్‌లో సెలబ్రేట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

ఆమె ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 2/24 బౌలింగ్ గణాంకాలు నమోదు చేశారు. మేధావి బిధూరి సాధారణంగా No. 12 జెర్సీ ధరించాలని అనుకున్నారని, కానీ ఆ నంబర్ అందుబాటులో లేక పోవడంతో ఆమె చెల్లెలు 67 నంబర్ తీసుకోవాలని సూచించారని త‌ను స్వయంగా వెల్ల‌డించారు. అదే “6-7” ట్రెండ్‌కు అనుసంధానమై ప్రత్యేక సెలబ్రేషన్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా 2025 Delhi Premier Leagueలో South Delhi Superstarz తరఫున ఆడింది మాధ‌వి బిధూరి. ఫైనల్‌లో Central Delhi Queensపై 3/26తో అద్భుతంగా బౌలింగ్ చేశారు. South Delhi Superstarz కేవలం ఒక్క పరుగు తేడాతో టైటిల్ గెలిచింది.

  • Related Posts

    ధృవ్ జురేల్ జోరు.. భార‌త్ భారీ స్కోర్

    శ్రీ‌లంక : కొలంబో వేదిక‌గా శ్రీ‌లంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు లో భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. 8 వికెట్లు కోల్పోయి 475 ప‌రుగులు చేసింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ధ్రువ్ జురెల్ అజేయ 95 పరుగులతో క్రీజులో…

    దుబాయ్ లో త్వ‌ర‌లో మ‌హిళ‌ల ఆసియా క‌ప్

    న్యూఢిల్లీ : వచ్చే వారం దుబాయ్‌లో జరిగే మహిళల ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ వరకు వెళితే బీసీసీఐకి ట్రోఫీని అందించే విషయంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ హోదాలో పాకిస్థాన్‌కు చెందిన మోసిన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *