బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం : స‌విత

అమ‌రావ‌తి : బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించామని, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామన్నారు . బీసీల రాజకీయ సాధికారతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్ల కోసం ముందుకు సాగు తున్నామన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందన్నారు. దాని వల్ల 16,800 రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దిడానికి కృషి చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 138 బీసీ కులాల ఆత్మగౌరవానికి, రక్షణకు పెద్దపీట వేస్తూ, బీసీ ప్రొటెక్షన్ యాక్ట్-2026 తీసుకు రావడానికి చర్యలు చేపట్టామని అన్నారు. బీసీల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, 50 ఏళ్లు పైబడిన 1,30,796 మంది మత్స్యకారులకు రూ.505 కోట్ల మేర పింఛన్లు అందించామని తెలిపారు. వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. చేనేత కార్మికులకు కూడా అండగా నిలిచామని, 50 ఏళ్లు పైబడిన 85,940 మంది చేనేత కార్మికులకు రూ.844 కోట్ల పింఛన్లు అందించామని తెలిపారు. 62,541 నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నేతన్నల సేవలో పథకం కింద మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.

దివ్యాంగుల సంక్షేమంలోనూ కూటమి ప్రభుత్వం ముందుందని మంత్రి సవిత తెలిపారు. దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు పెంచామన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం కోసం 1,750 మందికి మూడు చక్రాల వాహనాలు అందించామని, ఇందుకోసం రూ.18.47 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. రైతు, మహిళ, విద్యార్థి, బీసీ, మత్స్యకారుడు, చేనేత కార్మికుడు, దివ్యాంగుడు.. ఇలా ప్రతి వర్గానికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సంక్షేమాన్ని కేవలం మాటల్లో కాకుండా గణాంకాల్లో చూపిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.

  • Related Posts

    ప‌ని చేసే వాళ్ల‌ను ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పార్టీకి చెందిన నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సాధ్య‌మైనంత మేర‌కు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని, ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు వెళితే మిమ్మ‌ల్ని…

    సెప్టెంబర్ 17 నుండి అసలైన యుద్ధం : మల్లన్న

    హైద‌రాబాద్ : కేవ‌లం రెండు సంవ‌త్స‌రాల‌లో బీసీ రాజ్యం తీసుకు వ‌స్తానని ప్ర‌క‌టించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్ర‌క‌టించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *