ల‌క్ష్మీనారాయ‌ణ చెరువును కాపాడుతాం : హైడ్రా

హైద‌రాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ఏదులాబాద్ చెరువును కాపాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. దీనిని కాపాడాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున గ్రామ‌స్తులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఇవాళ క‌మిష‌న‌ర్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, హైడ్రా అదనపు కమిషనర్ . ఆనంద్ కుమార్‌లతో కలిసి చెరువును సందర్శించారు. అక్కడ గణేష్ నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు , పెద్ద సంఖ్యలో స్థానికులు హైడ్రా కమిషనర్‌ను కలిసి చెరువు చరిత్రను వివరించారు. కాలుష్యంతో సతమతమవుతున్న ఈ చెరువును కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉండి, ఒకప్పుడు తాగునీరు , సాగునీటిని అందించిన ఈ చెరువు, ప్రస్తుతం కలుషితమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలో హైడ్రా అనేక చెరువులను అభివృద్ధి చేస్తుండటంతో పరిసర ప్రాంతాల రూపురేఖలు మారాయని, అదే తరహాలో ఏదులాబాద్ లోని లక్ష్మీనారాయణ చెరువును కూడా అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ చెరువు నీటిని తాకితే చేతులకు జలగలు అంటు కుంటున్నాయని, తీవ్ర కాలుష్యం కారణంగా చేపలు చని పోతున్నాయని వాపోయారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని కలుషిత నీటి ప్రభావంతో బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ , వంధ్యత్వం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. జవహర్‌నగర్ డంప్ యార్డ్ నుండి వచ్చే వ్యర్థాలు మురుగునీటి ద్వారా చెరువులో కలిసి నీటిని కలుషితం చేస్తున్నాయని వారు ఫిర్యాదు చేశారు. మురుగు నీరు చెరువులోకి చేరకుండా కాలువను మళ్లించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చని వారు సూచించారు.

  • Related Posts

    ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వ‌హించాలి

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఈ నెల 17న జరగనున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర…

    ఏపీకి నీళ్లు పోతున్నా ప‌ట్టించుకోని స‌ర్కార్

    నాగర్‌కర్నూల్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ మొద్దు నిద్ర పోతోంద‌ని మాజీ మంత్రులు శ్రీ‌నివాస్ గౌడ్, ల‌క్ష్మా రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. శుక్ర‌వారం నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLIS) స్టేజ్-3…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *