ఖైరతాబాద్ వినాయకుడి మాదిరిగా ‘డూండీ’ గణపతి

విజయవాడ : ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. సంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా ఆరేళ్ల నుంచి 72 భారీ అడుగుల భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తూ వస్తున్న డూండీ గణేశ్ సేవా సమితి సభ్యులను అభినందించారు. ప్రజలంతా మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. విజయవాడలోని విద్యాధర పురంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల చముఖ వరసిద్ధి మహా గణపతి భారీ విగ్రహం ఆగమన వేడుకను మంత్రి సవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరవాత ఆరేళ్ల నుంచి భారీ ఎత్తున వినాయక నవరాత్రి ఉత్సవాలను డూండీ గణేశ్ సేవా సమితి నిర్వహిస్తూ వస్తోందన్నారు. ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలను ధీటుగా విజయవాడలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఎస్. స‌విత‌. ఈ సందర్భంగా మంత్రి సవిత డూండీ గణేశ్ సేవా సమితి మహిళా ప్రతినిధులతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. సంప్రదాయ నృత్య కళాకారిణులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకటన్న, కార్పొరేషన్ చైర్మన్లు డూండీ రాకేశ్, పేరేపీ ఈశ్వరరావు, సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    వ‌రుస సెల‌వులు శ్రీ‌శైలంలో పోటెత్తిన భ‌క్తులు

    నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్ర‌ముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం దేవాల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో ఆల‌యంలో కొలువు తీరిన శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శ‌నం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని నియంత్రించ‌డం ఒకానొక…

    గ‌ణేశ్ ఉత్స‌వాలకు భారీ భ‌ద్ర‌త క‌ల్పించాలి

    అమరావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి వినాయ‌క మండపాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ఆయా జిల్లాల ఎస్పీల‌తో హోం శాఖ మంత్రి టెలి కాన్ఫ‌రెన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *