అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. యూనిఫాం లేని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవాళ ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అయితే, పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ , రవాణా శాఖలలోని యూనిఫాం ధరించే ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) , ఇతర నియామక సంస్థల ద్వారా చేపట్టే రాబోయే నియామక ప్రక్రియలలో, యూనిఫాం అవసరం లేని (non-uniformed) అన్ని సర్వీసుల పోస్టులకు ఈ వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచారు. అలాగే, యూనిఫాం లేని సర్వీసులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న గరిష్ట వయో పరిమితిని 42 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ మరియు రవాణా శాఖలలోని యూనిఫాం ధరించే ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదని దీనిని గమనించాలని కోరింది. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, అందుకే తాము ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.





