జైల‌ర్ -2లో ర‌జ‌నీకాంత్ పారితోష‌కం రూ.125 కోట్లు..?

చెన్నై : త‌మిళ నాట సెన్సేష‌న్ త‌లైవా ర‌జ‌నీకాంత్. ఆయ‌న ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ లో న‌టించారు. ఇది ఊహించ‌ని రీతిలో భారీ స‌క్సెస్ న‌మోదు చేసింది. అంతే కాకుండా ర‌జ‌నీకాంత్ సినీ కెరీర్ లో అత్యంత విజ‌య‌వంత‌మైన మూవీగా నిలిచింది. భారీ రెమ్యూనరేష‌న్ కూడా తీసుకున్న‌ట్లు సినీ ఇండ‌స్ట్రీలో టాక్. ఈ చిత్రం స‌క్సెస్ కావ‌డంతో చిత్ర బృందం జైల‌ర్ -2 పేరుతో సీక్వెల్ కూడా రూపొందించారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక సినిమా విష‌యానికి వస్తే సన్‌ పిక్చర్స్ ఏకంగా ₹350 కోట్ల భారీ బడ్జెట్‌తో బాక్సాఫీస్ వద్ద ₹600 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా “జైలర్ 2” (#Jailer2) ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చింది.

ఈ భారీ సీక్వెల్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ ₹125 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాను అందుకోనున్నారు. ప్రతిరోజూ 500 నుండి 600 మంది సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఈ చిత్రం కోసం, ఇటీవల ఆదిత్య రామ్ స్టూడియోలో 51 కారవాన్లతో భారీ ప్యాచ్‌వర్క్ షెడ్యూల్‌ను ముగించారు. ఇక గత చిత్రం కూలీ మూవీకి – ఎ- సర్టిఫికెట్ రావడం వల్ల కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు థియేటర్లకు దూరం కావడాన్ని రజనీకాంత్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో రక్తపాతాన్ని వీలైనంత తగ్గించి, సినిమాను అందరూ చూసేలా కచ్చితంగా “U/A” సర్టిఫికెట్ వచ్చేలా మార్పులు చేయాలని ఆయన నెల్సన్ బృందాన్ని ఆదేశించారు. ఈ వ్యూహాత్మక చర్యతో సీక్వెల్ అందరినీ అలరించేలా రూపు దిద్దుకుంటోంది.

  • Related Posts

    ఈషా రెబ్బా త‌రుణ్ భాస్క‌ర్ నెట్టింట్లో వైర‌ల్

    హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్, న‌టి ఈషా రెబ్బ‌ల మ‌ధ్య రిలేష‌న్ షిప్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రూ క‌లిసి పూజ‌లు చేయ‌డం , ఇందుకు…

    సెప్టెంబ‌ర్ 25 నుండి జీ5లో య‌ష్ టాక్సిక్

    హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్ . దీనికి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. కానీ మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. భారీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *