సెప్టెంబ‌ర్ 25 నుండి జీ5లో య‌ష్ టాక్సిక్

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్ . దీనికి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. కానీ మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. భారీ ఖ‌ర్చుతో దీనిని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు. త‌న శ్ర‌మ‌నంతా ధార పోశాడు య‌ష్. కానీ ఆశించిన మేర ఆక‌ట్టుకోలేక పోయింది. అయిన‌ప్ప‌టికీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. యష్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ ఇప్పుడు డిజిటల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాలుగేళ్ల విరామం తర్వాత యష్ తిరిగి వస్తుండటంతో, విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దురదృష్టవశాత్తు టాక్సిక్ విడుద‌ల అయ్యాక‌ ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను Zee5 OTT ప్లాట్‌ఫారమ్ దక్కించుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25 నుండి Zee5లో ప్రసారం కానుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా , రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. ఇక OTTలో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

  • Related Posts

    బిగ్ బాస్ 10 సీజ‌న్ లో ఇద్ద‌రు ఎలిమినేట్

    హైద‌రాబాద్ : బుల్లి తెర రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది బిగ్ బాస్ 10 సీజ‌న్. ఈ రియాల్టీ షో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. అంచ‌నాలు పెంచ‌డంలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్ అక్కినేని నాగార్జున‌. గ‌తంలో…

    బాక్సాఫీస్ వద్ద ‘ఎపిక్’ మ్యాజిక్ తగ్గుముఖం

    హైద‌రాబాద్ : ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి క‌లిసి న‌టించిన చిత్రం ఎపిక్. ఆశించిన మేర వ‌సూళ్లు రాక పోవ‌డం కొంత నిరాశ‌కు గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకు పైగా రావాల్సి ఉంది. తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *