సీఎం చంద్ర‌బాబు నివాసంలో వినాయ‌క చ‌వితి

మంగ‌ళ‌గిరి : ఏపీలోని మంగ‌ళ‌గిరిలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నివాసంలో సోమవారం వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఘ‌నంగా పూజ‌లు చేప‌ట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తిపూర్వకంగా విఘ్నేశ్వరుడిని పూజించారు. కుటుంబ సమేతంగా జరిపిన ఈ గణనాథుని పూజ ఎంతో ఆధ్యాత్మిక తృప్తిని అందించింది అని ఈ సంద‌ర్బంగా తెలిపారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న త‌న భార్య భువ‌నేశ్వ‌రితో పాటు మ‌న‌వ‌డు హిమాంషుతో క‌లిసి పూజ‌లు నిర్వహించారు. గణపతి జ్ఞానం, విచక్షణ, విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయం. అడ్డంకులను తొలగించి, ధర్మ మార్గంలో నడిపించే ఈ చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను , సమష్టి భావనను కలిగిస్తాయి అని తెలిపారు .

సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించేవి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలే. వాటిలో, వివిధ పందిళ్లలో నిర్వహించే వినాయక చవితి వేడుకలు ఎంతో విశిష్టమైనవి. ఈ చవితి ఉత్సవాలు మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి శాశ్వత చిహ్నాలుగా నిలుస్తాయ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. వినాయకుని ఆశీస్సులతో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరారు . రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగి పోవాలని, ఆంధ్రప్రదేశ్ సమృద్ధిగా అభివృద్ధి చెందాలని , తెలుగు ప్రజలు ఆనందంతో విరాజిల్లాలని ఆ గణనాథుడిని ప్రార్థించాన‌ని తెలిపారు సీఎం.

  • Related Posts

    ఖైరతాబాద్ వినాయకుడి మాదిరిగా ‘డూండీ’ గణపతి

    విజయవాడ : ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. సంప్రదాయాలను పాటిస్తూ పర్యావరణానికి…

    వ‌రుస సెల‌వులు శ్రీ‌శైలంలో పోటెత్తిన భ‌క్తులు

    నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్ర‌ముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం దేవాల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో ఆల‌యంలో కొలువు తీరిన శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శ‌నం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని నియంత్రించ‌డం ఒకానొక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *