ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

అమ‌రావ‌తి : వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే రెండు రోజుల పాటు ఏపీలో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తాయ‌ని , జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. వాతావరణ సూచన ప్రకారం పగలు సాయంత్రం వేళల్లో తీర ప్రాంతంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి . మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, అలాగే రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చు. కోస్తా ఆంధ్ర , రాయలసీమలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. నంద్యాల, అనంతపురం, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ సూచన ప్రకారం తీరప్రాంత జిల్లాల్లో పగలు, సాయంత్రం వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చు. రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా చూసుకోవాలని కోరారు వాతావ‌ర‌ణ శాఖ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. కాగా గత రెండు రోజులుగా విశాఖపట్నం , గాజువాక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • Related Posts

    నిరుద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది. యూనిఫాం లేని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లకు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇవాళ…

    తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ మార్పు ..?

    హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కారణంగా మరో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పదవి కోల్పోనున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ త‌ప్పుకోనున్నారు. ఇప్ప‌టికే దీపా దాస్ మున్షీని ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తొల‌గించింది సీఎం సూచ‌న‌ల మేర‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *