మ‌ద‌న్ లాల్ ఖురానా ఫౌండేష‌న్ అంబాసిడ‌ర్ గా శాంస‌న్

న్యూఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌ర్యాద పూర్వ‌కంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖా గుప్తాతో భేటీ అయ్యారు. త‌ను ఆఫ్గ‌నిస్తాన్ తో జ‌రిగిన కీల‌క‌మైన టి20 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా రెండు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగి పోయాడు. త‌న వ‌ల్ల‌నే భార‌త్ లో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమిండియా వ‌శం చేసుకుంది. త‌ను అత్య‌ధికంగా ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు పొందాడు. ఆ త‌ర్వాత ఐర్లాండ్ తో జ‌రిగిన హోం సీరీస్ లో వైఫ‌ల్యం చెందాడు. ఆ త‌ర్వాత అనూహ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీని సంజూ శాంస‌న్ స్థానంలో ఇంగ్లండ్ సీరీస్ కు ఎంపిక చేశారు. దీంతో త‌ను తీవ్ర ఒత్తిడికి లోన‌య్యాడు శాంస‌న్. దీనిపై ఇటీవ‌లే నోరు విప్పాడు. త‌న మొత్తం కోచింగ్ కెరీర్ లోనే అత్యంత క‌ఠిన‌మైన నిర్ణ‌యం అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా భారత్ స్టార్ క్రికెటర్, యువత ఐకాన్ అయిన సంజు సామ్సన్ కు దేశ రాజ‌ధాని ఢిల్లీతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. త‌న తండ్రి కానిస్టేబుల్ గా ప‌ని చేశాడు. ఆ స‌మ‌యంలో బాల్య జీవితం ఇక్క‌డే గ‌డిపారు. తన క్రికెట్ ప్రస్థానాన్ని ఇక్క‌డి నుంచే ప్రారంభించారు. త‌ను మదన్ లాల్ ఖురానా ఫౌండేషన్ ద్వారా మోతీ నగర్‌లోని జన్ కౌశల్ కేంద్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుల‌య్యాడు. ఢిల్లీ యువతను నైపుణ్యాలు, అవకాశాలు, ఆత్మనిర్భరత వైపు ప్రేరేపిస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ ఖురానా జీ, ట్రినిటీ ఫౌండేషన్ , ఐఏసీటీ ఎడ్యుకేషన్ సీనియర్ సభ్యులు కూడా పాల్గొన్నారు.

  • Related Posts

    సంజు శాంస‌న్ పై గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

    ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజు శాంస‌న్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్. త‌న గురించి శాంస‌న్ ఢిల్లీ వేదిక‌గా చేసిన కామెంట్స్…

    సంజు శాంస‌న్ టి20 జ‌ట్టులో కీల‌క ఆట‌గాడు

    న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రిగిన కీల‌క‌మైన టి20 మ్యాచ్ లో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు స్టార్ బ్యాట‌ర్ సంజు శాంస‌న్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *