తిరుమలలో 27,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగ్‌లు

తిరుమ‌ల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చిన్నారుల భద్రతకు తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చైల్డ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించింది. చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడి పోయిన సందర్భాల్లో వారిని త్వరగా గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 15 నుండి చిన్నారులకు చైల్డ్ ట్యాగ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు రోజుల్లో మొత్తం 37,932 మంది చిన్నారులకు చైల్డ్ ట్యాగింగ్ కట్టారు.

చైల్డ్ ట్యాగింగ్ ద్వారా ఇప్పటి వరకు తప్పిపోయిన ముగ్గురు బాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. రద్దీ ప్రాంతాల్లో చిన్నారులు తల్లిదండ్రుల నుంచి విడి పోయినప్పుడు చైల్డ్ ట్యాగ్‌పై ఉన్న వివరాల ఆధారంగా వారిని త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులతో కలిపేందుకు ఇది ఎంతగానో దోహద పడుతోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు చిన్నారులను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవడంతో పాటు, చైల్డ్ ట్యాగ్‌ను భద్రంగా ఉంచాలని పోలీసులు సూచించారు. చిన్నారులు తప్పిపోయిన సందర్భంలో వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందిని లేదా భద్రతా సిబ్బందిని సంప్రదించాలని తిరుపతి జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వ‌స‌తి సౌక‌ర్యాల‌పై చైర్మ‌న్ ఆరా

    తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరింది గ‌రుడ వాహ‌న సేవా. ల‌క్షా 80 వేల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు స్వామి వారిని. ఈ సంద‌ర్బంగా భ‌క్తుల‌కు అందుతున్న వ‌స‌తి సౌక‌ర్యాల ప‌ట్ల ఆరా తీశారు…

    ఆక‌ట్టుకున్న సింగ‌పూర్ క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న

    తిరుమ‌ల : తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *