ప్రభుత్వానికి ఒక నెలలోనే రూ.18వేల కోట్ల రాబడి

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలలోనే సుమారు రూ. 18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, గత ఆగస్టులో రూ.17,893 కోట్ల ఆదాయం సమకూరినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల కాలంలో రూ.77,535 కోట్లు వచ్చినట్టు ప్రకటించింది. కాగా, ప్రభుత్వ ఆదాయం సగటున నెలకు రూ.15,507కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం కాకుండా అప్పులు రూ.34,285 కోట్లు తీసుకొచ్చినట్టు వెల్లడించింది. జులైతో పోలిస్తే ఆగస్టులో అతి తక్కువగా అప్పులు తీసుకున్నది. నాన్హాక్స్ రెవెన్యూలోనూ జులైతో పోలిస్తే ఆగస్టులో ఆదాయం తక్కువ ఉన్నా… గతేడాది కంటే దాదాపు ఐదు శాతం వృద్ధి నమోదైంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వార్షిక పరంగా చూస్తే గతేడాది కంటే రూ.30 వేల కోట్లకుపైగా అధికాదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

దీంతో ప్రభుత్వానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెసులుబాటు దొరుకుతుందని భావిస్తున్నారు. గత జూలైలో ప్రభుత్వానికి నాన్ టాక్స్ వె న్యూతో కలిసి రూ.17,117 కోట్ల ఆదాయం వచ్చింది. జులైలో నాస్టాక్స్ వెన్యూ రూ.1,577 కోట్ల మేర వచ్చింది. ఆగస్టులో మాత్రం రూ.1,201 కోట్ల ఆదాయం వచ్చినట్టు కాగ్ వెల్ల‌డించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన మూడేళ్లలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన స్థితి ఉందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. టాక్స్ రెవెన్యూలో 3.9శాతం, జీఎస్టీలో 4.78 శాతం, స్టాంప్స్ అండ్జిస్ట్రేషన్లలో 6.18శాతం, సేల్స్ టాక్స్ 3.83శాతం వృద్ధి నమోదైందని కాగిన నివేదికలో స్పష్టం చేసింది.

  • Related Posts

    రేవంత్ రెడ్డి స‌న్నిహితుడు గెస్ట్ హౌస్ కి ర‌మ్మ‌న్నాడు

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ కు చెందిన మిథున యాడ్స్ కంపెనీ ఓన‌ర్ కె. శోభా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స‌న్నిహితుడి నిర్వాకం గురించి ఆరోప‌ణ‌లు చేయ‌డం…

    క‌స్తూరి రంగ‌న్ నివేదిక‌పై నిర్ణ‌యం తీసుకుంటాం

    బెంగ‌ళూరు : కస్తూరి రంగన్ నివేదిక పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో క్షేత్రస్థాయి సర్వే జరపాలన్న డిమాండ్‌పై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్ప‌ష్టం చేశారు. ఉడుపి జిల్లాలోని హెబ్రిలో స్థానికులు, వివిధ సంస్థల ప్రతినిధులతో జరిగిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *